సీనియర్‌ న్యాయవాది గోపాల కిషన్‌ మృతి

జిల్లా కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదుల సంతాపం కరీంనగర్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది పర్లేర్ల గోపాల కిషన్‌ (87) సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు హాల్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులతో సంతాప సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్‌ న్యాయవాదులు గోపాల కిషన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయవాదిగా ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, వృత్తిపట్ల...