సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది
సరికొండలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కడ్తాల్, ఆగస్టు 18 (చైతన్యగళం): సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సరికొండ సర్పంచ్ పాలకూర్ల మహేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కడ్తాల్ మండలం సరికొండ గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద...