ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం మర్రిగూడ, ఆగస్టు 18 (చైతన్యగళం): సామాజిక సమానత్వం, స్వాభిమానం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 376వ జయంతి వేడుకలను మర్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బహుజన సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు జెండాను ఆవిష్కరించి, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, బడుగు, బలహీన వర్గాల...