పీఆర్సీని వెంటనే ప్రకటించాలి,సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్‌ను అమలు చేయాలి
టెట్ అర్హత మార్కులను అందరికీ 40 శాతంగా నిర్ణయించాలి: తపస్ నాయకులు యాచారం, ఆగస్టు 18 (చైతన్యగళం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని తపస్ రాష్ట్ర బాధ్యులు కాయల శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తపస్ యాచారం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తపస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న రాష్ట్ర మహాధర్నా నిర్వహించామని,...