వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్‌ అవమానించడం సిగ్గుచేటు

కాంగ్రెస్‌ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌ , ఆగస్టు 18 (చైతన్యగళం): జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే అవమానించడం దేశానికే సిగ్గుచేటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయులందరూ తలదించుకునేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని విమర్శించారు. కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌ వద్ద మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమ...