రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
మహబూబాబాద్, ఆగస్టు 18(చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని 18వ వార్డులో బొడ్రాయి నుంచి ఎన్‌హెచ్ రోడ్డు వరకు యూఐడీఎఫ్ నిధులు రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి...