CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:06 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

మహబూబాబాద్, ఆగస్టు 18(చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని 18వ వార్డులో బొడ్రాయి నుంచి ఎన్‌హెచ్‌ రోడ్డు వరకు యూఐడీఎఫ్‌ నిధులు రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 18వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్, మున్సిపల్ కమిషనర్, డీఈ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్‌చార్జి ఎడ్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగం మనోహర్, గిరిధర గుప్తా, తోట వెంకన్న, మొగిలి ప్రసాద్, జిన్నా, రెడ్డిపద్మ, వెంకటేశ్వర్లు, నూకల బాలకృష్ణారెడ్డి, సప్పిడి రంజిత్, నునావత్ రాజేష్, నూకల హరికృష్ణారెడ్డి, నూకల రామకృష్ణారెడ్డి, మేకల శ్రీనివాస్, నల్లపు భాస్కర్, బద్రు, సింగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.