చిన్నారిపై అమానుషం.. ఇద్దరు నిందితుల అరెస్టు
తాడుతో కట్టేసి హింసించిన వైనం.. గంటల వ్యవధిలో పోలీసుల అదుపులోకి మైనర్ బాలిక ఫొటోలు, వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ రామాంజి నాయక్ ఆత్మకూరు, ఆగస్టు 18 (చైతన్యగళం): తొమ్మిదేళ్ల చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అంగట్లో దొంగతనం చేసిందనే అనుమానంతో చిన్నారిని అక్రమంగా నిర్బంధించి, తాడుతో కట్టేసి హింసించిన ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్ పర్యవేక్షణలో చేపట్టిన చర్యల్లో నిందితులను ఘటన జరిగిన కొద్ది...