ప్రతి బూత్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కరీంనగర్, ఆగస్టు 18 (చైతన్యగళం): కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయిలో పటిష్ఠమైన పునాది నిర్మిస్తేనే పార్టీ విజయాలను మరింత సుస్థిరం చేసుకోగలదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 మంది బీఎల్‌ఏ-2లు, సూపర్‌వైజర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ...