ఘనంగా ఎడ్మ కిష్టారెడ్డి 6వ వర్ధంతి వేడుకలు

కల్వకుర్తి, ఆగస్టు 18 (చైతన్యగళం): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అభిమానులు, పలువురు నాయకులు కొనియాడారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో ఎడ్మ కిష్టారెడ్డి 6వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్, పాలమూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎడ్మ కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కల్వకుర్తి...