సైబర్‌ నేరాలపై విద్యార్థినులకు అవగాహన

అనుమానాస్పద లింకులు, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి కరీంనగర్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్‌, కరీంనగర్‌లో సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించేలా పలు స్కిట్లను ప్రదర్శించారు. కేవైసీ అప్‌డేట్‌, విద్యుత్‌ బిల్లు తదితర పేర్లతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని అధికారులు సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్‌ చేయడం, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు....