స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

బీసీలకు గ్రామీణ సంస్థల్లో 34 శాతం.. పట్టణ స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమరావతి, ఆగస్టు 18(చైతన్యగళం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్‌ అభిప్రాయపడింది. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల...