లెక్చరర్‌ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి

సస్పెండ్‌ చేసి.. ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి - విద్యార్థి సంఘాల డిమాండ్‌ దేవరకొండ, ఆగస్టు 18 (చైతన్యగళం): దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్‌వీ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ భాస్కర్‌ను...