ఎమ్మెల్యే సహకారంతో మిట్టకందలలో నూతన బోరు
ఎస్సీ కాలనీలో తాగునీటి ఎద్దడికి పరిష్కారం పాములపాడు, ఆగస్టు 18 (చైతన్యగళం): పాములపాడు మండలం మిట్టకందల గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సహకారంతో నూతన బోరు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి...