హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనకు భారీ బైక్ ర్యాలీ
ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి రంగారెడ్డి, ఆగస్టు 18 (చైతన్యగళం): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. Intensified IEC Campaignలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ పాపారావు, డీటీవో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. District Integrated Strategy for HIV/AIDS (DISHA) కార్యక్రమంలో...