బురదమయమైన రహదారిపై బీజేపీ వినూత్న నిరసన

ఎల్కతుర్తి, ఆగస్టు 17(చైతన్యగళం): ఎల్కతుర్తి–దామెర రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎల్కతుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. ఎల్కతుర్తి సర్కిల్ వద్ద బురదమయంగా మారిన రహదారిలో గుంతల్లో నాట్లు వేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ చింతలపల్లి–దామెర–సోమదేవరపల్లి–ధర్మసాగర్ రహదారి నాలుగు నెలలుగా అధ్వానంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...