ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌ చరిత్ర

డార్విన్‌ టెస్టులో 9 వికెట్ల ఘన విజయం.. తొలిసారి కంగారూలపై టెస్టు గెలుపు ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న బంగ్లా జట్టు.. తొలి మ్యాచ్‌లోనే కంగారూలకు గట్టి షాకిచ్చింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదుర్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా...