CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 8:13 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

గడివేముల, ఆగస్టు 15 (చైతన్యగళం):

బిలకలగూడూరు కమిటీ సిఐటియు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

అధ్యక్షుడు సి. పింమ్ అబ్ధుల్ సలాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రఫిక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నగర ప్రధాన కార్యదర్శి నజీర్ అహ్మద్ వలి ప్రతిజ్ఞలు చేయించి, “అమరవీరుల స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాల హక్కుల కోసం మరో స్వతంత్ర పోరాటం అవసరం” అని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అంజి, జగన్, శివ, రవి, శ్రీనివాసులు, చిన్న, ఎల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.