శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం
బ్రేక్‌ఫెయిల్‌తో అదుపుతప్పిన డీసీఎం.. కారును ఢీకొట్టి బోల్తా నంద్యాల, ఆగస్టు 16(చైతన్యగళం): శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీశైలానికి బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ మార్గమధ్యలో బ్రేక్‌ఫెయిల్ కావడంతో అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించుకునే ప్రయత్నంలో కారును ఢీకొట్టిన డీసీఎం.. అనంతరం రహదారికి అడ్డంగా బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స...