వ్యాపారంలోనే కాదు.. దేశభక్తిలోనూ ముందుంటామని చాటిన వీ వైశ్య హైదరాబాద్
80 మీటర్ల జాతీయ పతాకంతో వైభవంగా ఫ్లాగథాన్ హైదరాబాద్, ఆగస్టు 15 (చైతన్యగళం): దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యతను చాటుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వీ వైశ్య హైదరాబాద్ ఆధ్వర్యంలో 80 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ఫ్లాగథాన్‌ను ఘనంగా నిర్వహించారు. భారీ జాతీయ జెండాతో వీ వైశ్య సభ్యులు ఉత్సాహంగా కదం తొక్కడంతో నగరంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, TPCC జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై...