ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట, ఆగస్టు 15{చైతన్యగళం}: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ పెరేడ్‌ను మంత్రి పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు...