33 ఏళ్ల అగ్నిమాపక సేవలకు రాష్ట్రపతి పతకం

పదవీ విరమణకు ముందు అరుదైన గౌరవం.. నరసింహాచారికి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌ కరీంనగర్ టౌన్, ఆగస్టు 15 (చైతన్యగళం): అగ్నిమాపక, రక్షణ సేవల్లో 33 ఏళ్లపాటు అంకితభావంతో పనిచేసిన మానకొండూర్ అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్‌ఫైటర్‌ టి. నరసింహాచారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన సుదీర్ఘ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే–2026 సందర్భంగా ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌కు ఎంపిక చేసింది. 1993 బ్యాచ్‌కు చెందిన నరసింహాచారి తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో అగ్నిప్రమాదాల నియంత్రణ, రక్షణ చర్యలు, అత్యవసర...