CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 2:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మహిళా శక్తి పెట్రోల్ పంపులు ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ, ఆగస్టు 15 (చైతన్యగళం):

నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును ప్రారంభించారు అనంతరం మహిళలను ఉద్దేశించిన ప్రసంగించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహిళలను అన్ని రంగాలలో చైతన్యవంతులు చేసి ఆర్థిక స్వాలంబన తెలంగాణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి,కలెక్టర్ చంద్రశేఖర్ గార్లతో పాటు పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.