CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 2:35 pm Posted by : rakeshkashaveni12@gmail.com

మహమ్మదాపూర్ చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్

హుస్నాబాద్, ఆగస్టు 14 (చైతన్య గళం): మహమ్మదాపూర్ గ్రామంలో ఈ నెల 5న జరిగిన చోరీ కేసును హుస్నాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ.40 వేల నగదుతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కే. శ్రీధర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహమ్మదాపూర్‌కు చెందిన సున్నం రవీందర్‌రెడ్డి ఇంటి సిమెంట్ రేకులను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితుడు, బీరువాలో ఉన్న రూ.40 వేల నగదును అపహరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన కాసాని శివరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి వద్ద నుంచి రూ.40 వేల నగదుతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కేసును త్వరితగతిన ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుల్ సంజీవ్‌లను సీఐ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు.