ఇన్‌స్పెక్టర్ అనుముల నిరంజన్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం): తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించి, సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసిన కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనుముల నిరంజన్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన విశిష్ట పోలీస్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి ఇండియన్ పోలీస్ మెడల్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నిరంజన్‌రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక పతకాన్ని అందుకున్నారు. కానిస్టేబుల్‌గా ప్రస్థానం.. అనుముల...