CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:15 pm Posted by : rakeshkashaveni12@gmail.com

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జమ్మికుంట ఆగస్టు 15( చైతన్య గళం):
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మార్కెట్ సిబ్బంది, హమాలీలు, వ్యాపారులు, రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం మార్కెట్‌ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు, సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కార్యదర్శి మల్లేశం, రాజా, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, కమిటీ సభ్యులు, మార్కెట్ సూపర్వైజర్లు బాబా, సురేందర్, సిబ్బంది, వ్యాపారులు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.