సూర్యలక్ష్మి కాటన్ మిల్‌ ఆవరణలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆమనగల్(చైతన్యగళం): సూర్యలక్ష్మి కాటన్ మిల్‌ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎంగళి ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం కార్మికులు దేశభక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి స్ఫూర్తిని చాటారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు...