CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 10:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందచేసిన మాజీ మంత్రి గంగుల

కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం):

కరీంనగర్ నగరంలోని 31వ డివిజన్ గల్ఫ్ హై స్కూల్‌లో 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹5,000 నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ సయ్యిద్ ముఖద్దర్ ఆలీ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల, కార్పొరేటర్ ముఖద్దర్ ఆలీ చేసిన సేవలను అభినందించారు.