సిద్దిపేటలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
సిద్దిపేట, ఆగస్టు 15(చైతన్యగళం): సిద్దిపేట పట్టణంలోని వైశ్య కన్వెన్షన్ భవన్‌లో లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, జిల్లా లైబ్రరీ చైర్మన్ ధరిపల్లి చంద్రం, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య, ఆర్డీవోలు,...