సేవాభావానికి గుర్తింపుగా ప్రశంసా పత్రం
కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్య గళం): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్‌లో శనివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి వారి సేవలను గుర్తించారు. ఈ క్రమంలో నాణ్యమైన, సమర్థవంతమైన సేవలను అందిస్తూ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన జిల్లా సంక్షేమ కార్యాలయంలోని మిషన్ వాత్సల్య ఉద్యోగి యం. రాజ్‌కుమార్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి...