అమరవీరుల త్యాగాల సాక్షిగా.. నల్లగొండను అగ్రభాగాన నిలబెడతానని మీ బిడ్డగా మాట ఇస్తున్నా: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, ఆగస్టు 15 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్య భారతదేశమని, స్వాతంత్ర్యం అంటే కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ కాదని, దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయడం, సమాజం పట్ల...