యాచారంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 15 (చైతన్యగళం): యాచారం మండల కేంద్రంలోని పోస్టాఫీసు సమీపంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌పీఎం శశికాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. మొండి గౌరెల్లి బీపీఎం తాండ్ర జంగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో వివిధ పోస్టాఫీసులకు చెందిన బీపీఎంలు నంది వనపర్తి బీపీఎం వెంకటేష్, మంతన్ గౌరెల్లి బీపీఎం సత్యనారాయణ, చౌదర్‌పల్లి బీపీఎం...