మర్రిగూడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మర్రిగూడ, ఆగస్టు 15 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి, రాజకీయ పార్టీ కార్యాలయాలు, గ్రామపంచాయతీల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 అత్యంత పవిత్రమైన రోజని, 1947 ఆగస్టు 15న సుమారు 200 ఏళ్ల బ్రిటిష్ వలస పాలన నుంచి భారత్ విముక్తి పొంది స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఆవిష్కృతమైందని పలువురు పేర్కొన్నారు....