ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో జాతీయ పతాకావిష్కరణ కరీంనగర్‌, ఆగస్టు 15 (చైతన్యగళం): కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంగణం సందడిగా మారింది. కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌ గార్డ్‌ వద్ద పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమిషనరేట్‌ పరిపాలనా కార్యాలయం (సీపీఓ) వద్ద అడిషనల్‌ డీసీపీ (పరిపాలన) పి. వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు....