CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:06 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  • కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో జాతీయ పతాకావిష్కరణ

కరీంనగర్‌, ఆగస్టు 15 (చైతన్యగళం): కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంగణం సందడిగా మారింది.

కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌ గార్డ్‌ వద్ద పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమిషనరేట్‌ పరిపాలనా కార్యాలయం (సీపీఓ) వద్ద అడిషనల్‌ డీసీపీ (పరిపాలన) పి. వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని అధికారులు ఆకాంక్షించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కమిషనరేట్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, మినిస్టీరియల్‌ విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.