ప్రశాంతి విద్యానికేతన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 15(చైతన్యగళం): వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడిదెల చంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం, స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలు, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు వారు చేసిన త్యాగాలను ప్రసంగాల రూపంలో వివరించారు. విద్యార్థుల ప్రసంగాలు, దేశభక్తి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం...