కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా నాకాబందీ
82 వాహనాలు స్వాధీనం.. 128 స్పాట్ చలాన్లు రూ.25,700 జరిమానా.. రూ.87 వేల పెండింగ్ చలాన్ల గుర్తింపు కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా, ట్రాఫిక్ నిబంధనల అమలు లక్ష్యంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. కరీంనగర్ టౌన్, రూరల్, హుజురాబాద్ డివిజన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై గురువారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నాకాబందీలో భాగంగా మొత్తం 128 స్పాట్ చలాన్లు విధించి రూ.25,700 జరిమానా వసూలు చేశారు....