అత్యుత్తమ పోలీసు సేవకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్
కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్యగళం): పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు, అంకితభావం, క్రమశిక్షణ, సమర్థవంతమైన విధి నిర్వహణకు గుర్తింపుగా కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణకు ప్రతిష్ఠాత్మక ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ (PPM/MSM) లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్‌లో భాగంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు. 1991లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో సేవా ప్రస్థానం ప్రారంభించిన పి. వెంకట రమణ హైదరాబాద్ ట్విన్ సిటీస్‌లోని పలు కీలక, మతపరంగా...