విద్యకు దూరమైన వారికి ఓపెన్ స్కూల్ మంచి అవకాశం
కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం): విద్యకు దూరమైన విద్యార్థులు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకుని విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని తెలిపారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు ఓపెన్ స్కూల్ ద్వారా...