ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం): జిల్లాలో ఆరుతడి పంటల సాగును మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. రైతుల్లో అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. గతేడాది జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 16 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆరుతడి పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచేలా గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు...