ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై కొరడా
ఆమన్‌గల్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు.. వ్యాపార సంస్థలకు రూ.10 వేల వరకు జరిమానాలు ఆమన్‌గల్, ఆగస్టు 14 (చైతన్యగళం): ఆమన్‌గల్ పట్టణంలో పారిశుధ్యం, ప్రజారోగ్యం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి శుక్రవారం హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ధాబాలు, చికెన్ సెంటర్లు, ఆటోమొబైల్ షోరూమ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత, ఆహార హైజీన్ ప్రమాణాలు, ట్రేడ్ లైసెన్స్‌లను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన, లైసెన్స్‌లు లేని వ్యాపార సంస్థలపై రూ.10 వేల వరకు జరిమానాలు విధించారు. నిబంధనలు...