సుందరగిరిలో డీఎంహెచ్‌ఓ పర్యటన

హుస్నాబాద్, ఆగస్టు 14 (చైతన్యగళం): చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ రాజగోపాల్‌రావు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. డెంగ్యూ బాధితుడి నివాసాన్ని పరిశీలించి, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న స్ప్రేయింగ్‌ కార్యక్రమాలను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి యాంటీ లార్వల్‌ చర్యలు, స్ప్రేయింగ్‌కు అవసరమైన ద్రావణం తయారీ, వినియోగ విధానాన్ని సమీక్షించారు. డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు కేసు నమోదైన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెంటనే యాంటీ లార్వల్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించారు....