పంట మార్పిడే రైతుకు రాచబాట

కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం):    తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. పంటల మార్పిడితో నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు పెట్టుబడి తగ్గించి అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. శుక్రవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి 31 వరకు మొక్కజొన్న, ఉలవలు, అలసంద, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు తదితర ఆరుతడి పంటలకు అనుకూల సమయమని...