ఖర్గేకు అవమానంపై కరీంనగర్‌లో కాంగ్రెస్ గర్జన
కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం): కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అవమానానికి గురైన ఘటనను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ పాదయాత్ర, సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కిసాన్‌నగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించి, అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశానికి...