స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట, ఆగస్టు 14 (చైతన్యగళం):          ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం జిల్లా కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి శుక్రవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్య అతిథి, ఇతర ప్రముఖులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా...