గౌరవెల్లి భూనిర్వాసితుల పేరుతో చాడ వెంకట్‌రెడ్డి రాజకీయ డ్రామా
హుస్నాబాద్, ఆగస్టు 14 (చైతన్యగళం): గౌరవెల్లి భూనిర్వాసితుల సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్–సీపీఐ కూటమి, అదే సమస్యను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ విమర్శించారు. భూనిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేయడం చూస్తుంటే ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉందా, లేక రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఆందోళనల పేరుతో హడావుడి చేస్తున్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోందన్నారు. అర్హులైన ప్రతి భూనిర్వాసిత కుటుంబానికి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారం అందించాలని, పెండింగ్...