కరీంనగర్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ
కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం): భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి రామ్‌నగర్ వరకు సాగిన ర్యాలీలో కళాశాల విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే...