స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటే మహత్తర దినం

త్యాగధనుల స్ఫూర్తితో.. అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునరంకితం కావాలి భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన భారతదేశం సుమారు రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన అనంతరం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. ఆ రోజున బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి అధికార బదలాయింపు జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15ను దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం ఒక జాతీయ పండుగ...