పావులెవరు? పాలకులెవరు?

రాజకీయ స్వార్థానికి యువశక్తి బలి.. కార్యకర్తల జీవితాలతో చెలగాటం ఎందుకు? భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం. దేశ అభివృద్ధికి ఊపిరిపోసే అత్యంత విలువైన సంపద మానవ వనరులే. యువతలోని శక్తి, శ్రమ, ఆలోచన, నైపుణ్యం దేశ ప్రగతికి పునాది. అలాంటి యువశక్తి సరైన దిశలో నడిస్తే దేశం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుంది. కానీ నేటి రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే.. యువత శ్రమ, సమయం, భవిష్యత్తు ఎటు దారితీస్తున్నాయన్న ప్రశ్న ప్రతి సగటు రాజకీయ కార్యకర్త మనసును కలచివేస్తోంది....