CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 8:57 pm Posted by : rakeshkashaveni12@gmail.com

చెట్ల కొమ్మల తొలగింపుతో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కరీంనగర్, ఆగస్టు 13 (చైతన్యగళం):
చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. 33/11 కేవీ వావిలాలపల్లి ఉపకేంద్రం నుంచి 11 కేవీ ఐబీ ఫీడర్‌కు ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ అంతరాయం కారణంగా ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్ ప్రాంతం, పద్మనాయక కల్యాణ మండపం, కుంకుమపువ్వు స్వీట్ హౌస్, కోర్టు చౌరస్తా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.వినియోగదారులు విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఏడీఈ పి. శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.